ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు

By రాణి  Published on  28 March 2020 1:25 PM IST
ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజులు గడిచే కొద్దీ..రోజుకు 100 పైనే బయటపడుతున్నాయి. శనివారం నాటికి 873 కేసులు నమోదవ్వగా..20 మంది మృతి చెందారు. 21 రోజులు లాక్ డౌన్ విధించడంతో..ఇళ్లకే పరిమితమైన వారిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సలు చేసేందుకు సరైన వైద్య సదుపాయాలు లేవు. అందుకే రైలు బోగీలను కూడా ఐసోలేషన్ వార్డులుగా మార్చాలన్న నిర్ణయం తెరమీదికొచ్చింది. ఇది సాధ్యమా ? కాదా ? అన్న విషయాలను పరిశీలించిన ఇండియా రైల్వే సంస్థ..శనివారం నుంచి బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చే పనిలో నిమగ్నమైంది. బోగీలను పూర్తిగా శానిటైజ్ చేయిస్తోంది ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రైలు బోగీలను ఇలా మార్చడం వల్ల..సరైన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలందించే అవకాశం ఉంటుంది.

Also Read : ఇక ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష..

  • ప్రతి కోచ్‌లో రెండు మరుగుదొడ్లను బాత్‌రూమ్‌లుగా మార్చారు. ఇందులో కూడా ఫ్లోటింగ్ టాయిలెట్‌ పెన్‌ ఏర్పాటు చేశారు.
  • బెర్త్ లనే బెడ్లుగా మార్చి..ఐసోలేషన్ కోసం వచ్చేవారు సామాగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలను ఏర్పాటు చేస్తున్నారు.
  • బాధితులకు వైద్యం అందించేందుకు కరెంట్ తో కూడిన వైద్య సదుపాయాలు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి కంపార్ట్ మెంట్లో 220 వోల్టుల విద్యుత్‌ ను అనుసంధానం చేస్తున్నారు.
  • ప్రతి కోచ్‌లో పది ఐసోలేషన్‌ వార్డులు.. ప్రతి ఐసోలేషన్ కు ప్రత్యేకంగా కర్టెన్లను ఏర్పాటు చేస్తున్నారు.
  • ఐసోలేషన్ వార్డును ఉపయోగించే ముందు, తరువాత కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయనున్నట్లు భారత రైల్వే శాఖ వెల్లడించింది.

Also Read : వారంరోజులైంది..అది లేక నిద్ర కూడా పట్టట్లేదు..

Next Story