కేటీఆర్ సార్.. మీరే న్యాయం చేయండి..
By తోట వంశీ కుమార్ Published on 6 March 2020 6:38 PM ISTపబ్‌లో తనపై జరిగిన దాడి ఘటనపై సీసీ టీవీ పుటేజ్ ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు. తనకు న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సీసీటీవీ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాహుల్.. తనపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని చెప్పారు.
‘నాపై జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు చూడండి. ఆ గ్యాంగ్ నన్ను ఏవిధంగా రెచ్చగొట్టిందో, దాడి చేసిందో తెలుస్తోంది. ఈ వీడియో చూసి నిజం వైపు నిలబడండి. కేటీఆర్ సార్, నేను ఎప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ కోసమే పనిచేశాను. నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేశాను. నేను బతికి ఉన్నంతకాలం తెలంగాణకు సేవ చేస్తాను. సార్ మేము నమ్మి నాయకులను ఎన్నుకుంటాం.. కానీ వాళ్లు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన సొంత టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరులు పబ్లిక్‌లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యాను.
ఇక పై ఇలాంటివి ఆగాలి సార్. నాకు న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీరు సరైన చర్యలు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను. ఈ కేసును మీరు పర్యవేక్షించాలని కోరుతున్నాను. ఈ ఘటనకు సంబంధించి నా తప్పు ఉంటే నాపై కూడా చర్యలు తీసుకోండి. కానీ నా తప్పులేకపోతే.. ఓ సామాన్య వ్యక్తిగా నేను ఆరోజు ఎదుర్కొన్న ఆ ఘటనను ఎందుకు ఫేస్ చేయాలి..? మీరు నాకు, మాకందరికీ నాయకుడు. మీపై విశ్వాసం ఉంది. అలాంటి క్రూరమైన వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపాల్సిన సమయం వచ్చింది. మీరు కచ్చితంగా సరైన పనే చేస్తారని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు సార్’ అని రాహుల్ పేర్కొన్నాడు.