పేదలకు ఓ న్యాయం.. కేసీఆర్‌ కుటుంబానికి మరో న్యాయమా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2020 12:02 PM GMT
పేదలకు ఓ న్యాయం.. కేసీఆర్‌ కుటుంబానికి మరో న్యాయమా..?

రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని.. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ అనుమతి తీసుకున్న తరువాతే.. ఎంపీని అరెస్టు చేయాలన్నారు. 111 జీవో పరిధిలో నిర్మాణాలకు అనుమతి లేదన్నారు. అక్కడ ఫాంహౌస్‌ను ఎలా కట్టారని ప్రశ్నించారు. పేదలు నిర్మాణాలు చేసుకుంటే కూలుస్తారు. పేదలకు ఓ న్యాయం.. కేసీఆర్‌ కుటుంబానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు.

రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూముల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఫార్మా కంపెనీపై కూడా ప్రధానమంత్రి కి ఫిర్యాదు చేస్తామన్నారు. మూసి నది ఇప్పటికే మురికి నదిగా మారిందన్నారు. ఎంపీ రేవంత్ అరెస్టుపై పార్లమెంట్ లో చర్చిస్తామని తెలిపారు. ఎంపీ డ్రోన్ కెమెరా ఉపయోగించాడని కేసులు పెట్టడం వింతగా ఉందని, జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫార్మా సిటీ కి 36 అనుమతులు కావాలని, ఫార్మా సిటీని అడ్డుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని.. తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగు పడిందన్నారు.

Next Story