రాహుల్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్...?!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 18 Oct 2019 10:56 PM IST

హర్యానా: హర్యానా ఎన్నికల ప్రచారం ముగించుకుని రాహుల్ గాంధీ ఢిల్లీ తిరిగి పయనమయ్యారు. హెలికాప్టర్ గాల్లోకిలేచిన కాసేటికే...పెద్ద గాలిదుమారం లేచింది. దీంతో ...రివారీలోని కేఎల్పీ కాలేజీ మైదానంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అందరూ క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. హెలికాప్టర్ దిగింది...కాలేజీ మైదానం కావడంతో అక్కడ రాహుల్ పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక ఈ నెల 21న హరియాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Next Story