మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
By అంజి Published on 15 Dec 2019 7:32 PM ISTమహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సంతోష్ ను సీనియర్ విద్యార్థులు కొడుతూ, తిడుతూ వేధింపులకు గురిచేశారు. కాలేజీ ఇంటికి వచ్చాడు. తీవ్ర మనస్థపానికి గురైన సంతోష్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా సంతోష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై కాలేజీ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోలేదని బాధిత విద్యార్థి చెబుతున్నాడు.
Also Read
ఫతేపూర్ లో మరో ”దిశ” ఘటన Next Story