భారత వైమానిక దళంలోకి చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Sep 2020 9:55 AM GMTభారత సరిహద్దులో చైనా సైన్యం కాలుదువ్వుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన 5 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. రాఫెల్ విమానాల చేరికతో భారత రక్షణశాఖ బలం మరింత పెరిగినట్టయింది.
గురువారం అంబాలలోని వైమానిక స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానాలకు భారత రక్షణశాఖ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆకాశంలో మెరుపులు మెరిపిస్తూ సత్తా చాటాయి. రాఫెల్ యుద్ధ విమానాలను అధికారికంగా వాయుసేనలో ప్రవేశపెట్టారు. మొదటి బ్యాచ్‌కు చెందిన ఈ 5 రాఫెల్ యుద్ధ విమానాలు గోల్డెన్ యారోస్‌లోకి 17వ స్క్వాడ్రన్‌లో భాగం కానున్నాయి.
ఇదిలావుంటే.. నాలుగేళ్ల క్రితం భారత్‌కు, ప్రాన్స్ 36 రాఫేల్ విమానాలు అంధించే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ.59000 కోట్లు. ఈ విమానాల తయారీ బాధ్యతను ఆ దేశానికి చెందిన ఎరో స్పేస్ సంస్థ దసో ఎవియేషన్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్‌కు చెందిన ఐదు విమానాలు జులై 29న భారత్‌కు చేరుకున్నాయి.