రాధేశ్యామ్ ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ చూశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2020 9:02 AM GMT
రాధేశ్యామ్ ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ చూశారా..?

డార్లింగ్ అభిమానులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న త‌రుణం వ‌చ్చేసింది. ప్ర‌భాస్ న‌టిస్తున్న 'రాధే శ్యామ్' చిత్ర అప్‌డేట్ కోసం ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు. నేడు డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఇప్పటికే ప్రభాస్ విక్రమాదిత్య హీరోయిన్ పూజా హెగ్డే ప్రేరణ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ విడుద‌ల చేశారు.

ఓ అరచేతిలో చూపిస్తూ అందులో నుంచి ప్రయాణిస్తున్న ఓ రైలుని చూపించారు. ఆ రైలులో సలీం - అనార్కలి, రోమియో - జూలియట్, దేవదాస్ - పార్వతి వంటి కొంతమంది ప్రఖ్యాత ప్రేమికులను చూపిస్తూ రైల్లో నుంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ ని పట్టుకోవడం చూపించారు. అప్పుడే ట్రైన్ డోర్ లో నుంచి వింటేజ్ ప్రేమికులు ప్రభాస్ - పూజాహెగ్డే బయటకు వేలాడుతున్నట్లు చూపించారు. దీనికి చివరలో మ్యూజిక్ బిట్ జత చేశారు. మోషన్ పోస్టర్ అని చెప్పినా టీజర్ అనుకునే విధంగా చూపించారు. ఈ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

వింటేజ్‌ ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి న‌టి భాగ్య‌శ్రీ, ముర‌ళీ శ‌ర్మ లు కీల‌క ప్రాత‌లు పోషిస్తున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది వేసవి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Next Story