హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్

By సుభాష్  Published on  23 Oct 2020 5:26 AM GMT
హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్‌లో ప్రవేశించి తనదైన శైలిలో రాణిస్తూ అందరి చేత డార్లింగ్ పేరును సొంతం చేసుకొన్నాడు ప్రభాస్. నేడు డార్లింగ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్‌కు సంబంధించిన కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.

ప్ర‌భాస్ పూర్తి పేరు వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ ప్ర‌భాస్ రాజు ఉప్ప‌ల‌పాటి. డార్లింగ్‌, ప్ర‌భ‌, ప‌బ్సీ ఆయ‌న ముద్దు పేర్లు. సినీ నిర్మాత సూర్య నారాయ‌ణ రాజు కుమారుడు. ఆయ‌న స్వ‌స్థ‌లం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు. బీమ‌వ‌రంలోని డీఎన్ఆర్ పాఠ‌శాల‌లో చ‌దువుకున్నారు. హైద‌రాబాద్‌లోని శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో ఇంట‌ర్ పూర్తి చేశారు. ఆపై ఇంజినీరింగ్ చేశారు.

2002లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2004లో వచ్చిన వర్షం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సాంగ్స్ తో పాటు కథ కూడా అద్భుతంగా ఉండటంతో ప్రభాస్ కు సార్ ఇమేజ్ ను తెచ్చిపెటింది సినిమా. ఆ తరువాత ఈ యువహీరో చేసిన అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ను మార్చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది.

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ లు కొట్టాయి. దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించాయి. ప్రపంచంలోని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. అలాగే సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమా యావరేజ్ గా ఆడినా వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోవడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ స్టోరీతో రాధేశ్యామ్ , నాగ్ అశ్విన్ తో ఓ సినిమా , హిందీ దర్శకుడితో కలిసి ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు .

ప్ర‌ముఖ మ్యూజియం మేడ‌మ్ టుసాడ్స్‌లో మైన‌పు విగ్ర‌హం క‌లిగిన మొద‌టి ద‌క్షిణాది స్టార్‌గా ప్ర‌భాస్ గుర్తింపు పొందాడు. నిజానికి నేటి స్టార్స్ ఏడాదిలో రెండు, మూడు సినిమాలకు సంత‌కం చేసి న‌టిస్తుండ‌గా.. ప్ర‌బాస్ మాత్రం బాహుబ‌లి ప్రాజెక్టు కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించ‌డం గొప్ప విష‌యం. ఆయ‌న‌లోని ఆ గుణ‌మే నేడు ఈ స్థాయికి తీసుకొచ్చింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. 2014లో తొలిసారి హింది చిత్రంలో మెరిశారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సోనాక్షి సిన్హా నటించిన యాక్ష‌న్ జాక్స‌న్‌లో అతిథిగా క‌నిపించారు. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్ర‌భాస్ వివాహం కోసం అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. కానీ వృత్తి జీవితంలో బిజిగా ఉన్న ఆయ‌న పెళ్లిని ప‌క్క‌న పెడుతున్నారు. మ‌రీ ఈ సంవ‌త్స‌రం అయిన ప్ర‌భాస్ ఓ ఇంటివాడు అవుతాడో లేదో చూడాలి మ‌రీ.

Next Story