సికింద్రాబాద్‌లో సైకో వీరంగం.. వ్యక్తి తల బద్దలు కొట్టి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2020 1:59 PM GMT
సికింద్రాబాద్‌లో సైకో వీరంగం.. వ్యక్తి తల బద్దలు కొట్టి..

సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ సైకో పట్టపగలే వ్యక్తిని దారుణంగా చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. సైకో దాడిలో వ్యక్తి మృతి చెందినట్లు వీడియో బయటకు రావడంతో.. ఈ ఘటన అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్టేషన్‌ ముందుకు రాగానే అక్కడే ఉన్న సైకో కర్రతో ఆ వ్యక్తి తలవెనుక భాగంలో కొట్టాడు. ఒక్క దెబ్బతోనే ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. కిందపడ్డాక కూడా మరోసారి తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. అది గమనించిన మరో వ్యక్తి అక్కడకి పరిగెత్తుకొని రావడంతో సైకో అక్కడ నుంచి పరారయ్యాడు.

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వైజాగ్ కు చెందిన రవీందర్ రెడ్డిగా గుర్తించారు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఆ తరువాత కాసేపటికే సేపటికి అతను మరణించాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story