గుంటూరులో బస్సు బోల్తా.. 37 మందికి తీవ్ర గాయాలు

By అంజి  Published on  24 Feb 2020 6:29 AM GMT
గుంటూరులో బస్సు బోల్తా.. 37 మందికి తీవ్ర గాయాలు

గుంటూరు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటరమణ ట్రావెల్స్‌ చెందిన బస్సు నేషనల్‌ హైవేపై యడ్లపాడు వద్ద బోల్తా కొట్టింది. పోగాకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. అవతలి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 30 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని యడ్లపాడు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

Next Story
Share it