కోవిడ్-19 వైరస్ మీ ఇంటి దరిచేరకుండా చేయడం ఎలా?
By Medi Samrat Published on 27 July 2020 8:47 AM GMTPrecautions to Avoid Covid-19 కోవిడ్-19 కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ రహిత జీవితం అంటే వీలైనంతవరకు ఇంట్లో ఉండడం. కానీ మనం ఏదో ఒక సమయంలో కనీసం రోజువారీ అవసరాల కోసమైనా కిరాణా షాపులకు లేదా మెడికల్ షాప్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మనం వెళ్లిన పని ముగించుకుని తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కింద వివరించడం జరిగింది.
బయట పనులకు గాను ఒక ప్రణాళిక తయారు చేసుకోండి
• మీ పనులకు గాను బయట తిరగవలసిన సందర్భాలను చాలావరకు పరిమితం చేసుకోండి.
అత్యవసర సందర్భాల వలన బయటకు వెళ్ళాల్సిన సందర్భం ఎదురైనప్పుడు..
• ఇతరులకు మీకు మధ్య కనీసం ఆరు అడుగుల ఉండేట్లు చూసుకోండి
• షాపింగ్ చేసేటప్పుడు బండ్లు లేదా బుట్టలకు ఉన్న హ్యాండిల్స్ తుడవడం చేయకండి
• వీలైనంత వరకూ చేతి తొడుగులు మరియు ముఖానికి ముసుగు వాడండి
• మీరు బయటికి వచ్చినప్పుడు తరచుగా చేతులు కడుక్కోండి మరియు మీ ముఖాన్ని తాకకుండా ఉండండి
బయట నుండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక
• మీ చేతులను సబ్బు మరియు నీటితో 20 సెకన్ల పాటు కడగండి
• మీరు బయట తీసుకెళ్లే బాక్సులను మరియు ప్యాక్ చేసిన ఆహారాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి శానిటైజ్ చేయండి.
• మీరు బయట నుండి తీసుకు వచ్చిన ఉత్పత్తులను వంటగదిలో ఉంచే ముందు వాటిని బాగా కడగాలి
వైరస్ రహితముగా చేసుకోవడం
• మీరు తాకిన ప్రతిదాన్ని అనగా డోర్ నాబ్స్ , లైట్ స్విచ్లు, తాళం చెవిలు, ఫోన్, కీబోర్డులు, రిమోట్లు మొదలైనవి శానిటైజ్ చేయండి.
• పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ఆమోదించిన క్రిమిసంహారక మందులను వాడండి
మీకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వస్తువుల డెలివరీ విషయంలో
• మీకు పార్సిల్ వచ్చిన వస్తువులను ఇంటి గుమ్మంలో లేదా మీ కాంప్లెక్స్ ప్రాంతంలో వదిలివెళ్లమని సంబంధిత వ్యక్తులను అడగండి.
• డబ్బులు చెల్లించేందుకు వారు మీ వద్దకు రావాలంటే వారిని మీ ఇంటి తలుపులకు ఆరు అడుగుల దూరంలో ఉంచండి.
• సాధ్యమైనంత వరకు ఇలాంటి లావాదేవీలన్నీ ఆన్లైన్లో చెల్లించేలా జాగ్రత్త పడండి
• ఒకవేళ మీకు ఉత్తరాలు, ఇతర పార్సిల్స్ ఏవైనా వస్తే వాటిని తీసుకున్న తర్వాత మీ చేతులును శుభ్రముగా కడుక్కోండి
మన ఇంటికి అతిథులు వచ్చిన సందర్భాలలో
• ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అతిథులను ఇంటికి అనుమతించకపోవడమే మంచిది.
• బయట నుండి వచ్చిన మీరు కుటుంబ సభ్యుడిని లేదా స్నేహితుడిని తప్పని పరిస్థితుల్లో మీ వద్ద ఉంచాల్సిన అవసరం ఉంటే, వీలైనంత వరకు ఒకే రూమ్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
• మీరు, మీ ఇంటికి వచ్చిన వారు ఒకే రూంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోండి
మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే
• మొదట మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించండి
• అనారోగ్యానికి గురైనవారు వాడిన వస్తువులను, ఆ వ్యక్తిని ప్రత్యేక విశ్రాంతి గదిలోకి మార్చండి
• ప్రతిరోజూ వారు తరచుగా తాకిన ఉపరితలాలను శానిటైజ్ చేయండి
• వివిధ వస్తువులను వారితో పంచుకోవడం మానుకోండి
• వాషింగ్ మెషిన్ కడిగి శుభ్రం చేసిటప్పుడు చేతికి తొడుగులు ధరించండి
• మీ చేతులను తరచుగా కడుక్కోవడం కొనసాగించండి.
• అనారోగ్యం పాలైనవారు ఫేస్ మాస్క్ ధరించేలా చెయ్యండి.
ఇటువంటి పరిస్థితుల్లో మీకు అవసరపడే సామాగ్రి
• పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ఆమోదించిన క్రిమిసంహారకాలు వాడండి.
• మీకు క్రిమిసంహారకాలు లభించక పోతే ప్రత్నామ్నాయం గా బ్లీచ్ ని వాడండి.
• క్వార్టర్ నీటికి నాలుగు టీస్పూన్ల బ్లీచ్ కలపండి లేదా 70% ఆల్కహాల్ ద్రావణాన్ని ఉపయోగించండి
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• రెడీమేడ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, రొట్టెలు, పాస్తా, బట్టర్లు ఘనీభవించిన ఆహారాలు, కూరగాయలు, పండ్లు అవసరమైన మేరకు నిలువ చేసుకోవాలి.
• బయటి నుంచి తెచ్చుకున్న కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలను వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
మీకు పెంపుడు జంతువులు ఉన్నట్లయితే
• మీ పెరట్లో పెంపుడు జంతువును ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.
• పెంపుడు జంతువులతో బయట ఆడుకునే సందర్భాల్లో ఇతర వ్యక్తుల నుంచి దూరాన్ని పాటించండి.
• ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే కోలుకునేవరకు వాటినీ జాగ్రత్తగా చూసుకోమ్మని మీ దగ్గరి బంధువులు లేదా సన్నిహితులను అడగండి
• మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాటిని తాకుతున్నట్టయితే మీ చేతులను, పెంపుడు జంతువులు తరచుగా కడగాలి.
పై విషయాలు తప్పక పాటించినప్పుడు మన ఇల్లు వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉంటుంది.
Take daily precautions to help prevent the spread of respiratory illnesses like #COVID19. Learn how to protect yourself from coronavirus (COVID-19): https://t.co/uArGZTrH5L. pic.twitter.com/K1HT3mTsQ8
— CDC (@CDCgov) May 27, 2020