క్షీణిస్తోన్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 2:03 PM ISTభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఇంకా ఆయన కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది.
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. అయితే అదే సమయంలో జరిపిన పరీక్షల్లో ప్రణబ్‌కు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకింది. ప్రత్యేక వైద్యబృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.