కంగనా రనౌత్‌పై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sept 2020 7:24 PM IST
కంగనా రనౌత్‌పై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఏకంగా మహారాష్ట్ర సర్కారుతోనే పోరాటం చేస్తోంది. కంగనా రనౌత్‌కు కొందరు మద్దతు తెలియజేస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కంగనా వ్యవహార శైలిని విమర్శిస్తూ విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. కంగనా చుట్టూ వివాదాలు, సమస్యలు ఉండటాన్ని ఉద్దేశిస్తూ ప్రకాశ్‌రాజ్ సెటైర్‌ వేశారు. ఒక్క సినిమాతోను కంగనా రనౌత్‌.. తనను రాణీ లక్ష్మీబాయ్‌ అనుకుంటే.. పద్మావత్‌లో చేసిన దీపికా పదుకొనె, జోథా అక్బర్‌లో అక్బర్‌గా నటించిన హృతిక్‌, అశోక చిత్రంలో చేసిన షారూక్‌ ఖాన్‌, భగత్‌ సింగ్‌లో నటించిన అజయ్ దేవగణ్‌, మంగళ్‌ పాండేగా నటించిన ఆమిర్‌ఖాన్‌, మోడీగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏమనుకోవాలి' అని ప్రశ్నించేలా ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ కంగనా దీనిపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

కంగనా ఇటీవల మహా సర్కార్‌కు వ్యతిరేకంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా సుశాంత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌లో పలువురు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యల్ని శివసేన తీవ్రంగా పరిగణించింది. శివసేన నాయకులు ముంబయి రావొద్దని, సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లోను ఉండమన్నారు. దీనిపై స్పందించిన కంగనా.. ముంబైకి వస్తాను దమ్ముంటే ఆపండి ఛాలెంజ్‌ చేసి మరీ.. బుధవారం ముంబైలో అడుగుపెట్టింది. చట్ట విరుద్దంగా కట్టిన భవనం అంటూ ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చివేసిన సంగతి తెలిసిందే.



Next Story