ఉచిత విద్య.. మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన 'సోనూసూద్‌'

By సుభాష్  Published on  12 Sep 2020 11:02 AM GMT
ఉచిత విద్య.. మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన సోనూసూద్‌

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలను ఆదుకుని దేవుడిలా మారిపోయాడు. పేదలకు తన వంతుగా సాయం చేస్తూ ప్రశంసలు పొందారు. లాక్‌డౌన్‌ సమయంలో దారుణ పరిస్థితిలో ఉన్న వలస కార్మికుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం, సోషల్‌ మీడియా వేదికగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారిని తెలుసుకుని వివిధ రకాలుగా తనవంతు సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు. తాజాగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. మరణించిన తన తల్లి ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించబోతున్నట్లు ప్రకటించారు.



పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారో గత కొన్ని నెలలుగా చూస్తున్నానని, అలాగే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావడానికి కొంత మంది వద్ద కనీసం ఫోన్లు కూడా లేని పరిస్థితి ఉందని అన్నారు సోనూసూద్‌. మరి కొంత మంది వద్ద ఫీజు కట్టేందుకు డబ్బులు కూడా లేవని, అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నా.. నా తల్లి పేరు మీద స్కాలర్ షిప్‌ ఇస్తానని మాటిస్తున్నా. ఆమె పంజాబ్‌లో ఉచితంగా పిల్లలకు విద్య చెప్పేది. నన్ను కూడా విద్యార్థులకు సాయం చేయమని కోరేది. ఇన్నాళ్లు ఈ రూపంలో దానిని నెరవేర్చుకుంటున్నా. నాకు ఇదే సరైన సమయం అని సోనూసూద్‌ అన్నారు.

స్కాలర్‌షిప్‌కు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు

రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆ విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకుని ఉండాలి ఇదే నా షరతు అని, ఇప్పటికే పలు కోర్సు ఫీజు, వసతి, ఆహారం ఇలా అన్ని మేమే చేసుకుంటాం ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున కూడా ఆమె స్కెచ్‌ను షేర్‌ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు. నువ్వు చూపిన మార్గంలోనే నేను వెళ్తున్నా అమ్మా. గమ్యం చాలా దూరంలో ఉంది. కానీ ఖచ్చితంగా దాన్ని చూరుకుంటాను అని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవాల్సిన ఇ-మెయిల్‌: scholarships@sonusood.me

Next Story