ఆ గొడవలో రాహుల్ తప్పే లేదు : ప్రకాష్ రాజ్ ఫైర్..
By అంజి
హైదరాబాద్: సింగర్, బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై ఓ పబ్‌లో జరిగిన దాడి ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమి లేదన్నారు. తప్పు జరిగి ఉంటే బాటిళ్లతో కొట్టి చంపేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. రాహుల్ పక్కన తాము నిలబడతామని, న్యాయం కోసం పోరాడతామని అన్నారు.
Also Read: కేటీఆర్ సార్.. మీరే న్యాయం చేయండి..
తాజాగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని విప్ ఛాంబర్‌లో వీరి భేటీ జరిగింది.
ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ కేవలం సినిమా షూటింగ్ పని మీదే కలిశారని చీఫ్ వినయ్ భాస్కర్ తెలిపారు. తమ మధ్య ఓ సినిమా ఫంక్షన్ గురించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. రాహుల్ పబ్ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
Also Read: రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి