రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి

By సుభాష్  Published on  5 March 2020 3:26 AM GMT
రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి

సింగర్‌, బిగ్‌ బాస్‌ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో రాహుల్‌పై బీరు సీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ తన స్నేహితులతో, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి వచ్చారు. కాగా, కొంత మంది యువకులు రాహుల్‌ సిప్లిగంజ్‌ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో రాహుల్‌ వారిని నిలదీశాడు. దీంతో వారి మధ్య మాట మాట పెరిగి ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. రాహుల్‌పై బీరుసీసాతో దాడి చేయడంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Rahul

కాగా, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి బంధువులతో రాహుల్‌ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్‌పై దాడి జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన రాహుల్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాహుల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి వెళ్లిపోయాడు. కాగా, రాహల్‌ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయనట్లు తెలుస్తోంది. పబ్‌లో గొడవలపై సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Next Story
Share it