Fact Check : ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ను ఐసొలేషన్ వార్డుగా మార్చబోతున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2020 12:22 PM IST
Fact Check : ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ను ఐసొలేషన్ వార్డుగా మార్చబోతున్నారా..?

భారత్ లో లాక్ డౌన్ సడలించిన తర్వాత పెద్ద ఎత్తున కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 12,881 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,66,946కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 12,237కి పెరిగింది. మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా విపరీతంగా ప్రబలుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఐసొలేషన్ సెంటర్ సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఐసొలేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. 2500 బెడ్స్ ను ఏర్పాటు చేశారని అందుకు సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.



జూన్ 20 కల్లా ఈ ఐసొలేషన్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని పలువురు పోస్టులు పెడుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఝార్ఖండ్.. అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ ఫోటోలను షేర్ చేశారు. 2700 బెడ్స్ తో ప్రగతి మైదాన్ లో ఐసొలేషన్ యూనిట్ ను తయారుచేస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ పోస్టును అఫీషియల్ అకౌంట్ నుండి డిలీట్ చేశారు.

నిజ నిర్ధారణ:

ప్రగతి మైదాన్ ను ఐసొలేషన్ వార్డుగా మారుస్తున్నారన్నది 'పచ్చి అబద్ధం'.

మహారాష్ట్ర ఎం.ఎల్.ఏ. జీషన్ సిద్ధిఖీ ట్వీట్ చేస్తూ ఈ ఫోటోలు ముంబైకి చెందినవి.. అంతేకానీ ఢిల్లీకి చెందినవి కావు అని తేల్చేశారు.



“I wonder how ready Delhi is because that picture has ME walking inside our Covid-19 modular hospital at BKC, Bandra East – MUMBAI. This was when we were setting the hospital up. I don’t remember visiting Delhi anytime in the recent past so clearly that’s not Delhi.” అంటూ ఆయన అక్కడ ఉన్నది తానేనని ఢిల్లీకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ముంబై లోని బికెసి, బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు ఇవి అని జీషన్ తెలిపారు.

న్యూస్ మీటర్ వైరల్ అవుతున్న ఫోటోలను పరిశీలించగా అందులో మహారాష్ట్ర ఎంఎల్ఏ జీషన్ ను చూడొచ్చు.

M1

ప్రగతి మైదాన్ ను ఐసొలేషన్ వార్డుగా మారుస్తున్నారని మొదట ట్విట్టర్ లో పోస్టు చేసిన వ్యక్తులు.. తాము తప్పుడు సమాచారం అందించామని క్షమాపణలు చెప్పారు.

The Print కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఢిల్లీకి చెందినవి కావని తేల్చింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో 1000 బెడ్ల ఐసొలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినప్పటి ఫోటోలని తేలింది.

MMRDC, ముంబైకి చెందిన ఫోటోలు అని వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

https://timesofindia.indiatimes.com/videos/city/mumbai/mumbai-isolation-centre-for-covid-19-patients-at-mmrda-grounds-nears-completion/videoshow/75786764.cms

https://www.mumbailive.com/en/health/mmrda-quarantine-center-starts-on-16th-may-49618

https://www.newindianexpress.com/cities/mumbai/2020/may/21/bmc-to-acquire-100-beds-of-private-hospitals-in-each-mumbai-ward-2146178.html

ప్రగతి మైదాన్ ను ఐసొలేషన్ వార్డుగా మారుస్తున్నారన్నది 'పచ్చి అబద్ధం'. ఈ ఫోటోలు ముంబైకి చెందినవి.

Claim Review:Fact Check : ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ను ఐసొలేషన్ వార్డుగా మార్చబోతున్నారా..?
Claim Fact Check:false
Next Story