టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత

By అంజి  Published on  23 Jan 2020 8:57 PM IST
టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత

అమరావతి: టీడీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్‌బై చెప్పారు. సీఎం జగన్‌ సమక్షంలో పోతుల సునీత వైసీపీలో చేరారు. సునీతను సీఎం జగన్‌ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాలకు సునీత మద్దతు తెలిపారు.

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంను కోరానని తెలిపారు. ఏపీలో సీఎం చేస్తున్న అభివృద్ధి పనులకు సునీత తన మద్దతు తెలిపారు. దేశం మొత్తం నిన్న శాసనమండలిలో జరిగిన సంఘటన చూశారని, అది చాలా బాధకరమని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలన్న ఉద్దేశ్యంతోనే తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని సునీత్ తెలిపారు. తాను చట్టానికి లోబడి మద్దతిచ్చానని, చట్టం అతిక్రమించలేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేసి ఓడిపోయారు. సునీత భర్త అప్పట్లో పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు.

Next Story