తెలుగు చిత్రపరిశ్రమపై పూజా సంచలన వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 8:59 AM GMT
తెలుగు చిత్రపరిశ్రమపై పూజా సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్రపరిశ్రమపై టాప్ హీరోయిన్‌ పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. అలాగే హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. పూజా హెగ్డే వ్యాఖ్యలు ప్ర‌స్తుతం నెట్టింట్లో దుమారాన్ని రేపుతున్నాయి.

దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ.. ఇలా మాట్లాడడం స‌రికాద‌ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దక్షిణాదిని కించపరిచే బదులు ఎక్స్‌పోజింగ్‌ పాత్రలు చేయకుండా ఉండాలని హితవు పలుకుతున్నారు.‌ స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇచ్చిన తెలుగు ఆడియన్స్ కు పూజ తగిన గుణపాఠం చెప్పింద‌ని.. ఇక ఈ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోమ్మని పూజ‌పై ఫైర్ అవుతున్నారు.

ఇదిలావుంటే.. పూజా హెగ్డే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, అక్కినేని యువ హీరో అఖిల్‌కు జంట‌గా మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాల‌లో న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న క‌భీ ఈద్‌- క‌భీ దివాళీ సినిమాలో న‌టిస్తుంది. పూజా వ్యాఖ్య‌లు ద‌క్షిణాదిన దుమారం రేపుతున్న నేఫ‌థ్యంలో ఆమెకు అవ‌కాశాలు ద‌క్కుతాయో లేదోన‌న్న వార్తలు విన‌ప‌డుతున్నాయి.

Next Story