గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెత్తిన నటుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 3:32 AM GMT
గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెత్తిన నటుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రముఖ మోడల్, సినీనటుడు మిలింద్ సోమన్ తన పుట్టినరోజు సందర్భంగా గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు అతనిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవా బీచ్‌లో ఉదయం మిలింద్‌ సోమన్‌ నగ్నంగా పరిగెత్తగా ఆ ఫొటోను ఆయన సతీమణి అంకితా కోన్‌వార్‌ తీసింది. అనంతరం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

సినీనటి పూనం పాడే స్విమ్ సూట్ ధరించి అశ్లీల వీడియోను చిత్రీకరించిందని పోలీసులు ఆమెను అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. దీంతో మిలింద్ సోమన్ తన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నెటిజన్లు ప్రశ్నించడంతో పోలీసులు ఎట్టకేలకు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్ 294, సెక్షన్ 67 ప్రకారం బీచ్ లో తన నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story