మహారాష్ట్రలో ఎన్నికలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

By సుభాష్  Published on  2 May 2020 10:02 AM GMT
మహారాష్ట్రలో ఎన్నికలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకు తీపి కబురు వినిపించింది కేంద్ర ఎన్నికల సంఘం. శాసన మండలికి ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో తన సీఎం పదవి ఊడిపోతుందనే టెన్షన్‌లో ఉన్న ఉన్న ఉద్దవ్‌ థాక్రేకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా స్పందించింది . రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, రెండు రోజుల క్రితం ఉద్దవ్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. సీఎం ఫోన్ సంభాషణకు ఫలితం లభించినట్లయింది. మే 29 నాటికి ఉద్దవ్ రాష్ట్రంలోని ఉభయ చట్టసభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోతే సీఎం పదవీ నుంచి ఆయన తప్పుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు కనీసం గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యేందుకు థాక్రే చేసిన ప్రయత్నాలు గవర్నర్ బిఎస్ కోషోరియా అడ్డుతగిలారు.

రెండు సార్లు గవర్నర్ కోటాలో తనను నామినేట్ చేయాలని కేబినెట్లో తీర్మానం చేసి పంపినా ఆయన ఏ మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో టెన్షన్ పడిపోయిన ఉద్దవ్ థాక్రే రెండు రోజుల కిందట తన రాజకీయ పంతాలు పక్కనబెట్టి ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

ఇక థాక్రే ప్రయత్నం ఫలించడంతో గవర్నర్ కౌన్సిల్ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఇక శాసన మండలిలో ఖాళీగా ఉన్న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించింది. దీంతో మే 29న శాసన మండలికి ఎన్నికయ్యే అవకాశం దక్కడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఊపిరి పీల్చుకున్నారు.

Next Story