కాంగ్రెస్ పార్టీలో చేరనున్నా వైఎస్ షర్మిల.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
By అంజి Published on 2 Jan 2024 10:45 AM ISTకాంగ్రెస్ పార్టీలో చేరనున్నా వైఎస్ షర్మిల.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు కూడా. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆధిపత్యానికి ముగింపు పలికిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, ఈరోజు ఉదయం 11 గంటలకు పార్టీ నేతలందరితో వైఎస్ షర్మిల సమావేశమై పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు రెండ్రోజుల ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రయోజనం కలిగించే ఓట్ల చీలికను నిరోధించడానికి ఆమె నవంబర్ 30 న తెలంగాణలో పోటీ చేయడానికి నిరాకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నందున తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
''కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. అందుకే కేసీఆర్ అధికారంలోకి రావడం నాకు ఇష్టం లేదు. వైఎస్ఆర్ కుమార్తెగా నేను కాంగ్రెస్‌కు అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాను. 55కి పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తాను'' అని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు రెండ్రోజుల ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు పునరుద్ఘాటించారు.