ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మీ చేతగానితనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాం

YS Sharmila fires on KTR.నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకంక్ష‌లు తెలుపుతూ.. రాష్ట్రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 6:22 AM GMT
ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మీ చేతగానితనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాం

నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకంక్ష‌లు తెలుపుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఆయ‌న‌కు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న‌ట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా.. నేడు దీనిపై మ‌రోసారి స్పందించారు ష‌ర్మిల‌. ఉద్యోగాలు ఇవ్వాల‌ని కోరినందుకు కేటీఆర్ మ‌ద్ద‌తు దారులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

'గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకుల ఆత్మహత్యలు ఆపడం కోస‌మే మా పోరాటం. చిన్న దొరగారు మొద‌ట‌ ఆడవాళ్లు వ్రతాలే చేసుకోవాల‌న్నారు. నిన్నటి పుట్టినరోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లేచి నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు. మీ వ్యక్తిగత దూషణతో మా పోరాట స్ఫూర్తిని మరింత పెంచారు. మా కన్నా మేము ఎంచుకున్న పోరాటం గొప్పది. మీరు మమ్మల్ని అణచివేయాలని ఎంత గింజుకున్నా యువతకు ఉద్యోగాలిప్పించే వరకు మా పోరు సాగుతూనే ఉంటది. అంతవరకు మీకు ప్రతిరోజు మీ చేతగానితనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాం' అని ష‌ర్మిల ట్వీట్లు చేశారు. కాగా.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువకుడు గ‌తంలో పాడిన ఓ పాట‌ను ఆమె పోస్ట్ చేశారు.


Next Story