ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ : విజయశాంతి

Vijayashanti Comments On TRS And AIMIM Friendship. బీహార్‌లో టీఆర్ఎస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని

By Medi Samrat  Published on  22 Nov 2020 3:05 PM GMT
ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ : విజయశాంతి

బీహార్‌లో టీఆర్ఎస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. తద్వారా అనేక రాష్ట్రాలలో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారన్నారు. అందుకు అవసరమైన పెద్ద ఎత్తు నిధులను కూడా టీఆర్ఎస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు.

అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆర్ఎస్ - ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని.. ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆర్ఎస్ అధినేత.. ఎంఐఎంతో కలసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోదీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవేన‌న్నారు.

ఇక ఈ రోజు టీఆరెస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టీఆరెస్ - ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్ర అని.. ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదు.. పడదు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా? అని ప్ర‌‌శ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆర్ఎస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయని.. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ అని వ్యాఖ్యానించారు.


Next Story