ఇవన్నీ కేటీఆర్‌కు తెలియదు.. అంతా బుక్ నాలెడ్జ్ : జగ్గారెడ్డి
కేటీఆర్ నువ్వో బేవకూఫ్.. నువ్వు సిఎం రేవంత్ నీ తిడతవా..? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 3:01 PM ISTటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ నువ్వో బేవకూఫ్.. నువ్వు సీఎం రేవంత్ నీ తిడతవా..? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎంను గెలకడం ఎందుకు.. ఆయన తిడితే.. కేసులు పెట్టడం ఎందుకు అని మండిపడ్డారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం ఉందా లేదో అర్థం కావడం లేదన్నారు. సీఎం ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడే పనిలో బావ.. బామ్మర్ది ఉన్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏది మాట్లాడాలి.. ఏదీ మాట్లాడొద్దు అనేది తెలుసుకోవడం లేదన్నారు.
కేటీఆర్‌ది బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు
కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని రేవంత్ సీఎం కాలేదన్నారు. రేవంత్ కి ఫుట్‌పాత్ నుండి తెలుసు అన్నారు. నేను కూడా ఫుట్ పాత్ నుండి వచ్చిన వాళ్ళమే అన్నారు. నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్.. కేటీఆర్ మమ్మల్ని గెలకడం ఎందుకు..? అని హితువు పలికారు. కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్.. దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. కేటీఆర్ సీఎంను హౌలా గాడు అంటున్నాడు. నాకు బాధ అనిపించింది. మా సీఎంను హౌలా అంటే ఉరుకుంటామా.. నువ్వు ఒకటి అంటే మేము వంద అంటాం అన్నారు.
దామగుండం కి భూమి కేటాయించినప్పుడు 9 లక్షల చెట్లు ఉన్నాయని కేటీఆర్ కి ఎందుకు గుర్తు లేదు అన్నారు. 9 లక్షల చెట్లు పోతాయి అని తెలిసి ఎందుకు జీవో ఇచ్చినవు చెప్పు కేటీఆర్ అని ప్రశ్నించారు. రాడార్ వ్యవస్థ లో 1000 km లో ఉన్నా సిగ్నల్ అందిస్తుంది.. సముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారన్నారు. ఇవన్నీ కేటీఆర్ కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి.. ప్రాక్టికల్ నాలెడ్జి లేదన్నారు. మూసీ అక్కడే పుట్టింది అంటున్నావు.. మరి జీఓ ఇచ్చినప్పుడు గుర్తు లేదా మూసీ గురించి కేటీఆర్‌కు.. వీటికి సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ పదేళ్లు రాజభోగాలు అనుభవించాడు.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చి లేసి మాట్లాడుతున్నారన్నారు. నాలుగైదు రాష్ట్రాలకు డబ్బులు ఫండింగ్ చేసిన నువ్వు.. మాపై నిందలు వేయడం ఏంటి..? మేము ఎదురు దాడి చేయడం లేదని తమాషా చేస్తున్నావా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.