ఇక కాంగ్రెస్‌ అవసరం లేదని గాంధీజీ ఆనాడే చెప్పారు: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ అవసరం లేదని చెప్పారని అన్నారు.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 11:14 AM IST
telangana, elections, ktr tweet,  congress,

ఇక కాంగ్రెస్‌ అవసరం లేదని గాంధీజీ ఆనాడే చెప్పారు: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల ప్రచార హీట్ పెరిగింది. రోజురోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అవినీతి చేశారంటూ బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది. పాలనలో విఫమయ్యారంటూ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులకు బీఆర్ఎస్‌ నాయకులు కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్‌ను విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీలోనే అవినీతి జరుగుతోందని అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఈ విషయం స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే చెప్పారని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్‌ పోస్టును రూ.50 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారని కేటీఆర్ చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పదవులు అమ్ముకోవడం, కొనుగోలు చేయడం ఏంటో నంటూ విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. అలాంటి పార్టీకి చెందిన రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ అవసరం తీరిపోయిందని.. ఇకపై కాంగ్రెస్‌ దేశంలో అవసరం లేదని చెప్పారన్నారు. గాంధీజీకి కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి వారు ఉంటారని ముందే ఊహించి ఉంటారేమో అని మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. అవినీతి అనేది స్కాంగ్రెస్‌ (Corruption) పేరులోనే ఉందంటూ మరో పోస్టు చేశారు మంత్రి కేటీఆర్.

Next Story