కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు ఇస్తా.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 11:56 AM ISTకేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు ఇస్తా.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తూ.. గతంలో వారేం చేయలేందంటూ ప్రచారం జరుపుతోంది. అయితే.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిందేమీ లేదంటూ మండిపడుతున్నాయి. తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల వేళ ప్రచార హీట్ మరింత పెరిగింది. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై సంచలన కామెంట్స్ చేశారు.
నిజామాబాద్ మేనిఫెస్టోలో భాగంగా కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు తానే ఇస్తానని చెప్పారు ఎంపీ ధర్మపురి అర్వింద్. అలాగే కేటీఆర్ చనిపోతే అవి పెంచి రూ.10 లక్షలు ఇస్తానని.. ఇక కవిత చనిపోతే రూ.20 లక్షలు ఇస్తానని తన పార్టీ మేనిఫెస్టోలో పెడతానంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్ ఆ సందర్భంగా ఈ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ అర్వింద్ చెప్పుకొచ్చారు. ఇంటింటికీ బీమా కాదు.. కేసీఆర్ చనిపోతే రూ.5 లక్షలు తానే ఇస్తానంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆయన కొడుకు, కూతురు తెలంగాణకు పట్టిన చెదలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మద్యం దుకాణాలను క్లోజ్ చేయాలని.. ఇది తన తరుఫన ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి అని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఓటర్లకు మద్యం పంచుతూ అధికార పార్టీ నాయకులు అందరినీ తాగుబోతుల్లా తయారు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ పార్టీ డేంజర్ అంటూ ఓటర్లను అర్వింద్ హెచ్చరించారు. ముస్లిం సోదరులకు.. ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ఇప్పటిదాకా వారు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లేసి మునిగింది చాలని..తమకు ఎలాంటి విభేదాలు లేవు అందరి కోసం పనిచేస్తామంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు.
కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు, కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, కవిత సచ్చిపోతే 20 లక్షలు ఇస్తామని మా పార్టీ మానిఫెస్టోలో పెడతా - నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అరవింద్ pic.twitter.com/dOzwi1NJLO
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023