బీఆర్ఎస్‌ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 9:17 AM GMT
telangana, congress, minister komatireddy,  brs, harish rao ,

 బీఆర్ఎస్‌ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులు ఇవేనంటూ ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో రగడ జరుగుతోంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. అలాగే మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడారు. మాజీమంత్రి హరీశ్‌రావు కావాలనే ప్లాన్‌లో ఉన్నట్లు ఉన్నాడని చెప్పారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే తాము సపోర్ట్ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కేటీఆర్, హరీశ్‌రావు, కవిత పేర్ల మీదుగా విడిపోనుందని అన్నారు. అలా బీఆర్ఎస్‌లో నాలుగు చీలికలు వచ్చి పార్టీ బలహీనపడనుందని అన్నారు. హరీశ్‌రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడు అని వ్యాఖ్యానించారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలన్నారు. కేసీఆర్ కట్టె పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి పులి ఎలా అవుతారని ప్శ్నించారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏమవుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని ఏవేవో అంటున్నారనీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Next Story