ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక తథ్యం: హరీశ్‌రావు
తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కీలక తీర్పు వెలువరించింది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 1:30 PM ISTతెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తాజాగా కీలక కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన హరీశ్‌రావు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలుపరుస్తోన్న అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం పక్కా అన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు .
తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం తథ్యమని వ్యాఖ్యానించారు. అనర్హత కారణంగా ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణం తీసుకోవాలనీ.. అలాగే ఆయన కోర్టు తీర్పును గౌరవించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని భావిస్తున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కాగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలను ముగించిన తెలంగాణ హైకోర్టు అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.
ఎమ్మెల్యేల అనర్హత ఫిటీషన్ల పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2024
ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు.
తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం…