ఫోన్ ట్యాపింగ్‌ బాధితుడని చెప్పిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారు?: లక్ష్మణ్

సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తీవ్రంగా మండిపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  31 May 2024 9:00 AM GMT
Telangana, bjp, laxman,  cm revanth, phone tapping case,

ఫోన్ ట్యాపింగ్‌ బాధితుడని చెప్పిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారు?: లక్ష్మణ్

సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఏవేవో మాటలు చెప్పారన్నారు. రేవంత్‌రెడ్డికి పౌరుషం ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నిందితులను శిక్షించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ అవినీతిని కక్కిస్తామని పదేపదే రేవంత్‌రెడ్డి చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్న మొత్తాన్ని కక్కిస్తామని చెప్పారన్నారు. కానీ రేవంత్‌రెడ్డి తీరా సీఎం పదవిని చేపట్టాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాల గురించి అస్సలు పట్టించకోవడం లేదన్నారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారనీ.. అలాంటి వారికి శిక్ష పడేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఉపఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని లక్ష్మణ్ చెప్పారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

మాట్లాడితే తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటారని లక్ష్మణ్ అన్నారు. మరిఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాడం చేస్తూనే ఉంటుందన్నారు. న్యాయ పోరాటానికి సైతం బీజేపీ రెడీ అన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేవారు. లేదంటే తెలంగాణ చరిత్రలో రేవంత్‌రెడ్డి చరిత్రహీణుడిగా మిగిలిపోతారంటూ బీజేపీ లక్ష్మణ్ కామెంట్స్ చేశారు.

Next Story