నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల సలాం ఘటనలో పోలీసులను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. తమ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్టు చేస్తారా..? రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. నంద్యాల ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.. సలాం కుటుంబం ఆత్మహత్యపై టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. టీడీపీలో అక్రమాలను ప్రశ్నిస్తే మాపై హిందుత్వ ముద్ర వేస్తున్నారని అన్నారు.

విదేశీ విద్య పథకానికి నిధులివ్వడం లేదని, తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. ఘాట్లు నిర్మించినప్పుడు రూ.200 కోట్లు ఎందుకని, నదిలో పుష్కర స్నానాలు చేయవద్దని చెప్పడం సరికాదన్నారు. ముంపు మండలాలపై టీడీపీ, వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే విచ్చలవిడిగా జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టాలని ఆయన అన్నారు.

సుభాష్

.

Next Story