ఆహ్వానం అందింది.. ఎలాంటి అభ్యంతరం లేదు: వైఎస్ షర్మిల

కాంగ్రెస్‌లో చేరికపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు.

By Medi Samrat  Published on  2 Jan 2024 8:45 PM IST
sharmila, clarity,   congress, telangana ,

ఆహ్వానం అందింది.. ఎలాంటి అభ్యంతరం లేదు: వైఎస్ షర్మిల

కాంగ్రెస్‌లో చేరికపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం అందిందని.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని క్లారిటీ ఇచ్చారు.

షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొనిరావడం, ఆమె పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనానికి ఒప్పించడం వెనుక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మంత్రాంగం ఫలించినట్టు తెలుస్తోంది. దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి డీకే సన్నిహితుడు. ఆ చొరవతోనే కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించారని అంటున్నారు.

Next Story