వాయనాడ్ ఎంపీ పదవిని వదులుకోనున్న రాహుల్ గాంధీ?
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రెండు స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
By అంజి Published on 9 Jun 2024 7:30 AM ISTవాయనాడ్ ఎంపీ పదవిని వదులుకోనున్న రాహుల్ గాంధీ?
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రెండు స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఒక వ్యక్తి గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అనుమతించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951.. అభ్యర్థి కేవలం ఒక సీటును మాత్రమే నిలుపుకోగలరని పేర్కొంది.
లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి మాట్లాడుతూ.. ఏ అభ్యర్థి అయినా రెండు స్థానాల నుండి గెలిచిన ఎన్నికల ఫలితాల నుండి 14 రోజుల్లో ఒకదానిని వదులుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థి రాజీనామా చేయడంలో విఫలమైతే, వారు రెండు సీట్లను కోల్పోయే ప్రమాదంలో పడతారని అన్నారు.
రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ సీటును కొనసాగించాలని నిర్ణయించుకోవచ్చని సమాచారం. వయనాడ్ స్థానానికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ అంశంపై జూన్ 17లోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. జూన్ 8, శనివారం, రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ లేదా వాయనాడ్ సీటును కొనసాగించాలా అనే దానిపై చర్చించడానికి సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది.
కేరళకు చెందిన కొడిక్కున్నిల్ సురేశ్‌తో సహా పలువురు ఎంపీలు వాయనాడ్ సీటును కొనసాగించాలని వాదించగా, ఇతర ఎంపీలు రాయబరేలీ సీటును ఆయనే కొనసాగించాలని గట్టిగా కోరినట్లు ఇండియా టుడే పేర్కొంది.
1952 నుండి, కాంగ్రెస్ మూడు పర్యాయాలు మినహా రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 2004 నుండి 2019 వరకు రాయబరెలీ నియోజకవర్గం నుండి గెలిచారు. 2024 ఎన్నికలలో ఆమె తన కుమారుడు రాహుల్‌కు తన కంచుకోటను అప్పగించారు.
రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై 3.9 లక్షల ఓట్లతో గెలుపొందగా, వాయనాడ్‌లో సీపీఐకి చెందిన అన్నీ రాజాపై 3.6 లక్షల ఓట్లతో విజయం సాధించారు. రాహుల్ గాంధీ, అతని తల్లి, సోదరి వచ్చే వారం రాయ్‌బరేలీతని సందర్శించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి.