ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం.. చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటి.. పొత్తుల‌పై చ‌ర్చిస్తారా..?

Pawan Kalyan meet TDP chief Chandrababu Naidu.ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2023 12:31 PM IST
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం.. చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటి.. పొత్తుల‌పై చ‌ర్చిస్తారా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసానికి వెళ్లిన ప‌వ‌న్ ఆయ‌న‌తో స‌మావేశం అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై వీరిద్ద‌రూ చ‌ర్చించుకునే అవ‌కాశం ఉంది. చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు, పోలీసుల ఆంక్ష‌లు, త‌దిత‌ర విష‌యాల‌పై వీరు మాట్లాడుకునే అవ‌కాశం ఉంది.

కాగా.. గ‌తంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైన‌ప్పుడు ఆయ‌న్ను చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు చంద్ర‌బాబుకి ఎదురైన ప‌రిణాల దృష్ట్యా ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు ప‌వ‌న్ క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో నంబ‌ర్‌-1 పైనా తాజా భేటిలో చ‌ర్చించ‌నున్నారు.

ఈ ఇరువురు నేతల భేటీతో ఏపీ రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అలాగే రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన కు మ‌ధ్య పొత్తు ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రి మ‌ధ్య భేటికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

Next Story