క‌నీసం ఈ చొక్కా అయినా వేసుకోవ‌చ్చా..? వైసీపీ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

Pawan Kalyan counter YCP criticism of Varahi Color.త‌న‌ను వైసీపీ ప్ర‌భుత్వం అడుగ‌డుగునా అడ్డుకుంటోంద‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2022 10:01 AM IST
క‌నీసం ఈ చొక్కా అయినా వేసుకోవ‌చ్చా..?  వైసీపీ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

త‌న‌ను వైసీపీ ప్ర‌భుత్వం అడుగ‌డుగునా అడ్డుకుంటోంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "మొద‌ట‌గా నా సినిమాల‌ను అడ్డుకున్నారు. ఆ త‌రువాత విశాఖ‌ప‌ట్నం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు హోట‌ల్ గ‌ది నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ నుంచి బ‌య‌ట‌కు రాకుండా నా కారును అడ్డ‌గించారు. న‌డిచి వెళ‌దామ‌ని అనుకుంటే ఆటంకాలు క‌లిగించారు. ఇప్పుడు ప్ర‌చార ర‌థం వాహ‌న రంగు స‌మ‌స్య‌గా మారింది. క‌నీసం ముద‌రు ఆకుప‌చ్చ చొక్కా అయినా వేసుకోవ‌చ్చా. నన్ను ఊపిరి తీసుకోవ‌డం ఆపేయ‌మంటారా..?" అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ మండిప‌డ్డారు.

ఎన్నిక‌ల యుద్ధానికి సిద్ధం అంటూ ప‌వ‌న్ ఇటీవ‌ల త‌న ప్ర‌చార ర‌థ‌మైన 'వారాహి'కి సంబంధించిన‌ ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వాహానానికి ఆలీవ్ గ్రీన్ క‌ల‌ర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాహానానికి నిషేదిత రంగు వేశారని ర‌వాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మిల‌ట‌రీ వాహ‌నాల‌కు వాడే ఆలీవ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహ‌నాల‌కు వినియోగించ‌డం నిషేదం అని చ‌ట్టం చెబుతోంద‌న్నారు. మీరు ఎలాగో రంగు మార్చాలి కాదా అదేదో ప‌సుపు రంగు వేసుకుంటే స‌రిపోతుంది. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటివి సినిమాల్లో న‌డుస్తాయ‌ని, నిజ జీవితంలో కుద‌ర‌ని చెప్పారు. పేర్నీ నాని చేసిన విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ పై విధంగా స్పందించారు.

Next Story