జనసేన యువత బలం చూసి బీజేపీ పెద్దలు ఆశ్చర్యపోయారు: పవన్
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతి స్థాయి సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla
జనసేన యువత బలం చూసి బీజేపీ పెద్దలు ఆశ్చర్యపోయారు: పవన్
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతి స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని పేర్కొన్నారు. జనసేన పార్టీకి యువతే పెద్ద బలనమి అన్నారు. జనసేన పార్టీ బలం చూసిన బీజేపీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇదంతా జనసేన కార్యకర్తల చిత్తశుద్ది వల్లే జరిగిందన్నారు పవన్. జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు రావడానికి పార్టీ శ్రేణులు, యవతే కారణమన్నారు. తనని. తన భావజాలాన్ని నమ్మి యువత జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఇంత మంది అభిమానుల బలం ఉందని గర్వం రాకూడదు అనీ.. పొరుగు రాష్ట్రాల యువత కూడా వచ్చి మనకు మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిందని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసిందని పేర్కొన్నారు. ఖమ్మం, మధిర, కూకట్‌పల్లి, దుబ్బాక ఎక్కడికి వెళ్లిన జనసేన కోసం పెద్ద ఎత్తున యువత తరలివచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వైసీపీకి భావజాలం అలాంటివేవీ లేవన్నారు. ఎందుకు పని చేస్తున్నారో కనీసం వారికి కూడా తెలియదంటూ విమర్శలు చేశారు. వైసీపీ వారు అన్న ముఖ్యమంత్రి కావాలి.. అందుకే పనిచేస్తున్నామంటారు. అంతేకానీ.. ప్రజలకు ఏదైనా చేస్తామని మాత్రం చెప్పరంటూ వైసీపీ నేతలపై పవన్ విమర్శలు చేశారు. సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం మాత్రం తనకు బాధ కలిగించిందన్నారు. తన సినిమాలు ఆపినా.. హోటల్స్‌కు వచ్చి బెదిరించిన తమ పోరాటం తామే చేశామన్నారు పవన్. అంతేకానీ.. జాతీయ స్థాయి నేతల వద్దకు వెళ్లి సాయం కావాలని కోరలేదన్నారు. మన నేల.. మన పోరాటం.. మనమే చేయాలన్నారు. కుదిరితే మనం వారికి బలం అవ్వాలి కానీ.. మనం బలం చూపించకపోతే ఎవరూ మద్దతు ఇవ్వరన్నారు. నాయకులు స్వార్థం వదిలేయాలని.. మనం చేసే పోరాటమే గుర్తింపు ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.