ఏఐఎంఐఎం పార్టీ ఒక్క తెలంగాణకే పరిమితం అవ్వడం లేదు. పలు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ నిలబెట్టిన అభ్యర్థులు విజయాన్ని అందుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ ఒవైసీ ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్ర‌చారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ ప్రారంభిస్తార‌ని పార్టీ యూపీ అధ్య‌క్షుడు షౌక‌త్ అలీ వెల్ల‌డించారు.

ఇక అయోధ్య స‌భ అనంత‌రం ఓవైసీ ఈనెల 8, 9 తేదీల్లో సుల్తాన్‌పూర్‌, బార‌బంకిలో జ‌రిగే స‌భ‌ల్లోనూ పాల్గొననున్నారు. అయోధ్య‌లోని రుదౌలిలో వ‌చ్చే మంగ‌ళ‌వారం జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ఓవైసీ ప్ర‌సంగిస్తార‌ని చెప్పారు. ఈ స‌భ‌కు హిందువులు, ముస్లింలు, ద‌ళితులు, బీసీల‌ను ఆహ్వానించామ‌ని తెలిపారు. బీజేపీ హ‌యాంలో ముస్లింలే కాకుండా అన్ని కులాలు, వ‌ర్గాల ప్ర‌జ‌లు వేధింపులు ఎదుర్కొంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వ అణిచివేత‌కు గురైన వ‌ర్గాల హ‌క్కుల కోసం పోరాడేందుకు యూపీ అంత‌టా వంచిత్‌-షోషిత్ స‌మాజ్ స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఏఐఎంఐఎం నిర్ణ‌యించింద‌ని తెలిపారు.


M. Sabarish

నేను శ‌బ‌రీష్‌, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో భార‌త్ టుడే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story