మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం తుది అంకానికి చేరుకుంది. నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. నిన్నటి సాయంత్ర వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఒక్కరోజే 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు సమర్పించారు. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల17 చివరి గడువు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్న పాల్వాయి స్రవంతి
నామినేషన్ దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చండూర్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. బంగారు గడ్డ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీపీసీసీ ఇప్పటికే పిలుపునిచ్చింది.