అసెంబ్లీ నుంచి సీతక్క వాకౌట్‌..సభను ఎన్నికలకు వాడుకుంటున్నారని ఆరోపణ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సీతక్క. ఆమె సభ నుంచి వాకౌట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 7:27 AM GMT
MLA Seethakka, Walkout, Assembly, Telangana, BRS, Congress,

అసెంబ్లీ నుంచి సీతక్క వాకౌట్‌..సభను ఎన్నికలకు వాడుకుంటున్నారని ఆరోపణ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సీతక్క. అధికార పార్టీ తీరుని వ్యతిరేకిస్తూ ఆమె సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదన్నారు ఎమ్మెల్యే సీతక్క. సభలోకి వచ్చాక కూడా బిజినెస్‌ గురించి చెప్పడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. జీరో అవర్‌లో కూడా మాట్లాడే చాన్స్‌ ఇవ్వడం లేదన్నారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఎలా చెప్పుకోలగలరని సీతక్క ప్రశ్నించారు. ఎంత సేపు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడినా స్పీకర్‌ వారికి అడ్డు చెప్పడం లేదు అని.. కానీ.. అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడితే నిమిషం అవ్వగానే మైక్ కట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు ఏదో చేస్తానని ఓట్లేసి గెలిపించారని.. కానీ అధికార పార్టీ స్వేచ్ఛగా సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సభ నుంచి వాకౌట్‌ చేశానని తెలిపారు .

అసెంబ్లీలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుందని.. బీఆర్‌ఎస్‌ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారని అన్నార. రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనపై విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. అయితే.. ఎన్నికల ప్రచారం కోసమే బీఆర్ఎస్‌ అసెంబ్లీ సమావేశాలను వాడుకుంటోందని ఆరోపించారు. నాలుగన్నర ఏళ్ల క్రితం ఎన్నికల సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ల ప్రగతి గురించి ఎలా చర్చిస్తారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సభ నిర్వహణ ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. సమస్యలు లేవని చెబుతున్న ప్రభుత్వం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అడిగారు.

Next Story