పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది: మంత్రి రోజా
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 9:09 AM GMTపవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది: మంత్రి రోజా
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అందుకే పవన్ అధహ పాతాళానికి వెళ్లిపోయాడని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. విశాఖలో మంత్రి రోజా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నారంటూ మంత్రి రోజా విమర్శలు చేశారు. ముష్టి 30 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ తీసుకోలేకపోయారని అన్నారు. అలాంటి వ్యక్తికి సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను మోసం చేస్తున్నారని అన్నారు. పైగా పార్టీ కేడర్‌ను తప్పుపట్టడం ఏంటి అని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడుతున్నారనీ..అలా మాట్లాడినంత మాత్రాన ఓట్లు రావనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.
గత ఎన్నికల్లోనే ప్రజలు జనసేన పార్టీని ఆదరించలేదని చెప్పారు మంత్రి రోజా. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోవడం సిగ్గుచేటని అన్నారు రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామని మంత్రి రోజా అన్నారు. అందులో భాగంగానే సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రిమెన్ కమిటీ సూచించిందని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి అంగీకరిస్తే అది క్యాంపు కార్యాలయం అవుతుందనీ.. లేదంటే టూరిజం భవనాలుగా ఉంటాయని చెప్పారు. ఒక మహిళ ఎదుగుతుంటే నీచంగా మాట్లాడటం.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జనసేన, టీడీపీలకు అలవాటుగా మారిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు.