రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంట‌ర్‌.. ముందు ఆమేథీలో గెల‌వండి

Minister KTR Counter To Rahul Gandhi Comments On KCR.కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 12:26 PM IST
రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంట‌ర్‌.. ముందు ఆమేథీలో గెల‌వండి

కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. అంత‌ర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేఠీలో గెల‌వ‌లేక‌పోయారు. అటువంటి వ్య‌క్తి కేసీఆర్ జాతీయ పార్టీపై మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్ర‌జ‌ల్ని మెప్పించి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెల‌వాల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. 2019లో అమేథీ నుంచి ఎంపీ పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

ఏం జ‌రిగిందంటే..

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తెలంగాణ రాష్ట్రంలో కొన‌సాగుతోంది. నిన్న రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్‌లో రాహుల్ గాంధీ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీపై సెటైర్లు వేశారు. కేసీఆర్‌కు ఇష్టం ఉంటే అంత‌ర్జాతీయ పార్టీ కూడాపెట్టుకోవ‌చ్చున‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, తాము టీఆర్ఎస్ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. దీనిపైనే నేడు మంత్రి కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. రాహుల్ యాత్ర‌ హైదరాబాద్ కు చేరుకుంది. కాలేజీ విద్యార్థులతో కలిసి రాహుల్ శంషాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. ఆరాంఘర్, బహదూర్ పురా, పురానాపూల్, హుస్సేనీ ఆలం, లాడ్ బజార్, చార్మినార్, మదీన, గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకోనుంది.

Next Story