నా గెలుపు కోసం BRS నేతలు పరోక్షంగా ప్రచారం చేశారు: రఘునందన్‌రావు

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంచలన కామెంట్స్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Jun 2024 7:15 PM IST
medak, bjp, mp raghunandan rao,   brs,

 నా గెలుపు కోసం BRS నేతలు పరోక్షంగా ప్రచారం చేశారు: రఘునందన్‌రావు

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంచలన కామెంట్స్‌ చేశారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకొన్నట్లు ఇప్పుడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే.. అంతా సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన కామెంట్ చేశారు. అందరినీ అణిచివేయాలనే దోరణి అవలంభించడంతోనే బీఆర్ఎస్‌కు ఈ పరిస్థితి పట్టిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్‌కు బైబై చెప్పారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కాగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు.

దుబ్బాకలో రఘునందన్‌రావుకి ప్రోటోకాల్‌ లేకుండా చేద్దామనుకున్నారని అన్నారు. కానీ.. నేడు సిద్దిపేటలో కూడా కూడా ప్రొటోకాల్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్‌ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందని రఘునందన్ రావు అన్నారు. అయితే.. దుబ్బాకలో తన గెలుపు కోసం బీఆర్ఎస్‌ నాయకులు కూడా పరోక్షంగా ప్రచారం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకొన్నట్లు నేడు బీజేపీ గెలిచిన తర్వాత అంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.

గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్‌ రైతుల నుంచి భూములు లాక్కున్న బీఆర్ఎస్‌ నేత వెంకట్‌ రాంరెడ్డి తిరిగి భూములను వారికి ఇచ్చేయాలని రఘునందన్‌రావు అన్నారు. లేదంటే ఎక్కడి వరకు అయినా పోరాడుతామని వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంకట్‌ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్‌ భూములపై విచారణ జరిపించాలని డిఆండ్ చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎన్నికల ముందు పెద్ద పెద్దమాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Next Story