లేఖల యుద్ధం.. మంత్రి గుడివాడ అమర్నాథ్ vs హరిరామజోగయ్య
Letters War Between Amarnath and Harirama Jogaiaih.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2023 6:17 AMఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగు దేశం నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తోండగా మరో వైపు టీడీపీ, జనసేన పొత్తు విషయంలో కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య, మంత్రి గుడివాడ అమర్నాథ్ ల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది.
వంగవీటి మోహన రంగాను చంపించింది చంద్రబాబు నాయుడే అని మీరే పలుమార్లు విమర్శించారు. అలాంటి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తును మీరు సమర్థిస్తారా..? అని అమర్‌నాథ్ ఓ లేఖను నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
— Gudivada Amarnath (@gudivadaamar) February 7, 2023
రెండు రోజుల క్రితం.. కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్‌కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరబాటున నాకు రాశారు. మీరు ఆయురారోగ్యాలతో పాటు మానసికంగా ధృఢంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ గుడివాడ అమర్‌నాథ్ లేఖ రాశారు.
— Gudivada Amarnath (@gudivadaamar) February 5, 2023
అంతకముందు హరిరామ జోగయ్య లేఖ రాయడం ఇద్దరి మధ్య హీట్‌ను పెంచింది. ఈ లేఖలో మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి అంటూ లేఖలో రాశారు. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు, అనవసరంగా పవన్ కల్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు, నీ మంచి కోరి చెబుతున్న అంటూ హరిరామజోగయ్య మంత్రి అమర్నాత్ కు హితవు పలికారు.