ఈ రెండు జిల్లాలపైనే పవన్ ప్రత్యేక దృష్టి

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జోరు పెంచుతున్నారు.

By అంజి  Published on  11 Feb 2024 3:16 PM IST
Jana Sena, Pawan Kalyan, Godavari districts, APnews, TDP

ఈ రెండు జిల్లాలపైనే పవన్ ప్రత్యేక దృష్టి

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జోరు పెంచుతున్నారు. మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమయ్యే పర్యటనలో తొలుత భీమవరంలో అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. పవన్ కల్యాణ్‌ దృష్టంతా ఉభయ గోదావరి జిల్లాలపైనే ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోబోయే సీట్లు చాలా వరకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండబోతున్నాయి. రెండు జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. మహాకూటమిలో జనసేనకు వస్తాయని భావిస్తున్న 25 సీట్లలో పవన్ గోదావరి జిల్లాల్లో 12 సీట్లు అడుగుతున్నారు. ప్రచారంలో ఉన్న భీమవరం, కాకినాడ నియోజకవర్గాలపై కూడా పవన్ దృష్టి సారించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఓడిపోయిన చోటే గెలవాలని పవన్ పట్టుబడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కి అస్సలు పడదు. పవన్, ద్వారంపూడిల మధ్య బహిరంగ సవాల్ ఏంటో అందరికీ తెలిసిందే. అంతేకాదు భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, కాకినాడలో ద్వారంపూడి తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పదే పదే పవన్‌కు సవాల్‌ చేస్తున్నారు. పవన్ పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ పై రెండు నియోజకవర్గాలపై పవన్‌ ప్రత్యేక దృష్టి సారించిన మాట వాస్తవం. అందుకే పై రెండు నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మరి పవన్ పై నియోజకవర్గాల్లో నిజంగా పోటీ చేస్తారా? లేకుంటే మిత్రపక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.

Next Story