బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్.. మోదీ సైన్యంలో చిన్న సైనికుడిలా

Hardik Patel joins BJP after quitting Congress months ahead of Gujarat elections.గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 3:26 PM IST
బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్.. మోదీ సైన్యంలో చిన్న సైనికుడిలా

గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికలకు నెలరోజుల ముందు గుజ‌రాత్‌లోని గాంధీనగర్‌లో బీజేపీలో చేరారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయం వెలుపల పాటిదార్ నేతను బీజేపీలోకి స్వాగతిస్తూ పోస్టర్లు వేశారు.

గురువారం ఉదయం హార్దిక్ పటేల్ అందుకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తానని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఒక చిన్న సైనికుడిగా పని చేస్తున్నట్లు ప్రకటించారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం కోసం సైనికుడిలా పనిచేస్తానని, దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేటి నుంచి రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నానని ఈ ఉదయం ట్వీట్ చేశారు. నేను ఎప్పుడూ ఏ పదవి కోసం ఎవరి ముందు డిమాండ్‌లు పెట్టలేదు.. పని చేయడానికి బీజేపీలో చేరుతున్నాను.. ఇతర పార్టీల నేతలు వచ్చి చేరాలని కోరుతున్నాను. పీఎం మోదీ యావత్ ప్రపంచానికి గర్వకారణమని బీజేపీలో అధికారికంగా చేరే ముందు హార్దిక్ పటేల్ అన్నారు.

బీజేపీలో చేరాలని కాంగ్రెస్‌ నేతలను హార్దిక్‌ పటేల్‌ కోరే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో ప్రజలు కనెక్ట్ అవుతున్నప్పుడు, తానూ కూడా అలాగే చేయాలని అనుకుంటూ ఉన్నానని అన్నారు. పలు ముఖ్యమైన నేతలను బీజేపీలోకి ఆహ్వానించబోతున్నట్లు హార్దిక్ పటేల్ తెలిపారు.

పాటిదార్‌ కమ్యూనిటీ కోసం రిజర్వేషన్‌ డిమాండ్‌తో చేసిన ఆందోళనకు నేతృత్వం వహించాడు హార్దిక్‌ పటేల్‌. గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించాడు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. మే 19న రాజీనామా చేశాడు. పార్టీలో తనను పక్కన పెట్టారని, తనకు ఎలాంటి బాధ్యతలు కూడా ఇవ్వలేదన్నారు.

Next Story