రుణమాఫీ అయిన రైతుల కన్నా..కంటతడి పెట్టినవారే ఎక్కువ: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2024 10:43 AM IST
brs,   ktr,  Telangana, congress govt, dengue ,

రుణమాఫీ అయిన రైతుల కన్నా..కంటతడి పెట్టినవారే ఎక్కువ: కేటీఆర్ 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. రైతురుణమాఫీ గురించి కేటీఆర్ స్పందించారు. రుణమాఫీ అయిన రైతుల కంటే కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అన్ని విధాలా రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హత ఉన్నా.. రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పేటోడో లేడని ఫైర్ అయ్యారు. రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా మొదలు పెట్టలేదన్నారు. జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా డబ్బులు ఆగస్టు దాటుతున్నా ఇంకా అందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడం లేదంటూ విమర్శలు గుప్పించారు. రైతు కూలీలకు రూ.12వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అంటేనే మొండి చేయి అనీ.. మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారంటూ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు.

తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. వార్తాపత్రికలు మరణాలను రిపోర్ట్ చేశాయని చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. డేటారు ఎవరు దాచారు..? ఎందుకు దాస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవనీ.. చాలా ఆస్పత్రుల్లో ముగ్గురు నలుగురు రోగులు ఒకే బెడ్‌ షేర్ చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తీవ్రమైన సమస్య ఉందనీ.. ప్రభుత్వం దీన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.


Next Story