కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల రేపటికి వాయిదా

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 12:45 PM IST
brs, power point presentation, Adjourned, ktr, telangana ,

కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల రేపటికి వాయిదా 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు శ్వేతపత్రం వర్సెస్‌ స్వేత పత్రంతో వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. అయితే.. వీటికి కౌంటర్‌గా బీఆర్ఎస్‌ తమ వాదన వినిపించేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నారు. సస్వేద పత్రం విడుదల శనివారమే ఇస్తామని చెప్పారు. కానీ.. ఆ కార్యక్రమాన్ని బీఆర్ఎస్‌ ఆదివారానికి వాయిదా వేసింది.

తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ విమర్శలను తిప్పి కొట్టేలా గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను బీఆర్‌ఎస్ ఆదివారానికి వాయిదా వేసింది.

అయితే.. ఈ కార్యక్రమం ఆదివారం ఉంటుందని తెలుస్తోంది. ఇవాళ ఉండాల్సిన స్వేతపత్రం విడుదల కార్యక్రమం వాయిదా ఎందుకు పడిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ పాలన సువర్ణ అధ్యాయమని.. దాని కోసం ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వివరించేందుకే స్వేద పత్రం పేరిట పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

Next Story