ఆరు నెలల్లో సీఎం రేవంత్‌కు శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 4:00 PM GMTఆరు నెలల్లో సీఎం రేవంత్‌కు శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ట్రయల్ పూర్తయిందని చెప్పారు. మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డికి శిక్ష పడటం ఖాయమని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనీ.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడటం దురదృష్టకరమని పాడి కౌశిక్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ చెప్పుకుంటుందని.. ఇది ఏమాత్రం సబబుకాదన్నారు. ఒకరు చేసిన పనిని తాము చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు కౌశిక్‌రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు భర్తీ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాడి కౌశిక్‌రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లపాటు పనిచేయాలని బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని చెప్పిన కౌశిక్‌రెడ్డి... ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండే అయ్యేది రేవంత్‌రెడ్డి అని అన్నారు. రేవంత్‌రెడ్డి పాథలాజికల్ లయర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. ప్రతి నిత్యం అబద్దాలు చెప్పడం రేవంత్‌రెడ్డికి అలవాటే అన్నారు. అందుకే ఈ పదం వాడుతున్నట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ నాయకులు హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికారం శాశ్వతం కాదనీ.. రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు.