కేటీఆర్‌ను సీఎం రేవంత్ జైల్లో వేస్తారని నమ్ముతున్నా: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 3:53 PM ISTకేటీఆర్‌ను సీఎం రేవంత్ జైల్లో వేస్తారని నమ్ముతున్నా: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాట్లాడుతూ.. కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. బీజేపీ కార్యకర్తలను హింసించిన కేటీఆర్ తీరును ఎవరూ మర్చిపోలేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైతే ఎవరూ ఊహించని యుద్ధం చేస్తామన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ చర్చలు జరుపుతుందనేది ఫేక్ వార్తలు బండి సంజయ్ చెప్పారు.
పాలనలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌కు తేడా లేకుండా పోయిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ టైమ్‌లోనే ప్రజా వ్యతిరేకతను చూరగొన్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండబోతుందని అన్నారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విర్శించారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని చెప్పారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీష్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామం అని అన్నారు.
కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారనీ.. మరి ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయి... పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయన్నారు. పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందనడం సరికాదన్నారు. తన పార్లమెంట్ పరిదిలో 80 శాతం ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తా అని చెప్పారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడి మార్పును హైకమాండ్ తీసుకుంటుందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.