AP: రేపటి నుంచి వైఎస్‌ షర్మిల జిల్లాల టూర్

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.

By అంజి
Published on : 4 Feb 2024 12:29 PM IST

APPCC, YS Sharmila,APnews, Congress

AP: రేపటి నుంచి వైఎస్‌ షర్మిల జిల్లాల టూర్

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదటి విడతలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రోడ్‌ షోలు, రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలను ఆమె నిర్వహించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె.. ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచే షర్మిల యాత్ర ప్రారంభమవుతుండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

మడకశిర పర్యటన తర్వాత శింగనమల, దర్శి, బాపట్ల, తెనాలి, జంగారెడ్డిగూడెంలో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొనున్నారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు జోరు పెంచారు. ఇప్పటికే జిల్లాలు వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీకి ఉన్న బలం, బలహీనతలను తెలుసుకున్నారు. షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక్కసారిగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. మరి వచ్చే ఎన్నికల్లో షర్మిల ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.

Next Story